అంబీర్ చెరువు పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ రావ్
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోనీ ఆంబీర్ చెరువు వాకింగ్ ట్రాక్ సుందరీకరణ మరియు చెరువు లోకి ప్రగతి నగర్ డ్రైనేజీ నీరు వల్ల పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించుటకు చేపట్టే పనులను జిహెచ్ఎంసి ఏఈ రాజీవ్ మరియు వాకర్స్ తో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, ఆంబీర్ చెరువు వాకింగ్ ట్రాక్ సుందరీకరణ మరియు చెరువు లోకి ప్రగతి నగర్ డ్రైనేజీ నీరు వల్ల పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించుటకు జేసిబి రప్పించి తక్షణమే వ్యర్థాలను తొలగించమని మరియు చెరువు వలన దోమల నివారణ కొరకు డ్రోన్ ను తెప్పించి చెరువులో మందు చెల్లించి, ఆయిల్ సీడ్ బాల్స్ ను చెరువులు లో వేసి, ప్రతి రెండు రోజులకు ఒకసారైనా ఫాగింగ్ జరిగేలా చూడాలని అధికారులకు చెప్పడం జరిగింది అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు. ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ రాజీవ్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.