ప్రమాదానికి గురైన చిన్నారులను పరామర్శించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి
నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్ లో నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామం లో ప్రమాదవశాత్తు గత ప్రభుత్వం నిర్లక్షం వలన అంగన్వాడీ భవనాన్ని సరిగ్గా రిపేర్ చేయకపోవడంతో అంగన్వాడీ కేంద్ర భవనంలో పై కప్పు పెచ్చు ఉడి 5 మంది చిన్నారులపై పడడంతో చిన్నారులకు చిన్న గాయాలు ఆయన విషయం తెలుసుకొని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి చిన్నారులను పరామర్శించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
అనంతరం ఎమ్మెల్యే చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు చిన్నారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు