ఏపీను స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చదిద్దగలిగే ఏకైక నాయకుడు నారా చంద్రబాబునాయుడు మాత్రమే

ఏపీను స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చదిద్దగలిగే ఏకైక నాయకుడు నారా చంద్రబాబునాయుడు మాత్రమే – గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

 

గుంతకల్లు నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం గుంతకల్లు పట్టణంలోని క్యాంపు కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ మీడియాకు రాజకీయానికి అవినాభావ సంబంధం ఉందని తెలుపుతూ ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదములు అని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8నెలలు కాలంలోనే గుంతకల్లు నియోజకవర్గం లోనే సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపుగా కోటి రూపాయలు లబ్ధిదారులకు అందజేశామని తెలుపుటకు గర్విస్తున్నామని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణంధ్రప్రదేశ్ గా మార్చే శక్తి కేవలం ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని, ఈ సందర్భంగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న యువనాయకుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నానని గుమ్మనూరు జయరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment