పేద రైతుల భూములపై కన్నేసిన మైరాన్ హోమ్స్
-కలెక్టర్ కు వినతి పత్రం
-అందిస్తున్న రైతులు
రైతులు తమ భూములను మైరాన్ హోమ్స్ కబ్జా చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోందని,దానిని అడ్డుకోవాలని శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ కు ఎన్కేపల్లి గ్రామం రైతులు పిర్యాదు చేశారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఎన్కేపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న మైరాన్ హోమ్స్ సంస్థ పెద్ద ఎత్తున్న వెంచర్ చేసింది.కొంత మంది రైతులు వారి భూములను మైరాన్ హోమ్స్ కు అమ్ముకున్న రైతుల పొలాల చుట్టూ ఫ్రీ కాస్ట్ (కంచె) వేసింది. రైతుల (ఇనామ్) పట్టా కలిగి ఉన్న రైతులను భయబ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని స్థానిక రైతులు వాపోతున్నారు.రైతుల భూములను జేసీబీలతో రాత్రి రాత్రి పనులు సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 115 లో రైతులం ఉన్నామని దానిని కబ్జా చేసేందుకు చూస్తుందని మండిపడ్డారు.రైతుల భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే శివ సాగర్ ప్రాజెక్ట్ కు వెళ్ళే వాటర్ నాలాల ను సైతం కబ్జా చేసిందని,శివ సాగర్ కు నీటిని అధ్యధికంగా ఈ నాల ద్వారానే నీరు వెళ్తుంది.దీని పై ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.రైతుల భూములను ఆక్రమించాలని చూస్తున్న మైరాన్ హోమ్స్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.వినతి పత్రం అందజేసిన వారిలో రైతులు భీమయ్య, బుజ్జమ్మ, విజయ్ కుమార్ పెంటయ్య తదితరులు ఉన్నారు…