నా వార్డ్ ప్రజలే నాకు శ్రీరామరక్ష 

నా వార్డ్ ప్రజలే నాకు శ్రీరామరక్ష 

బి ఆర్ ఎస్ మాజీ కౌన్సిలర్ భవాని నాగరత్నం గౌడ్.

 

 

 మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు మాజీ కౌన్సిలర్ రాచకొండ భవాని నాగరత్నం గౌడ్ కౌన్సిలర్ గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 8వ వార్డు పరిధిలోని బీసీ కాలనీ యువకులు సన్మానించారు.

 కౌన్సిలర్ భవాని నాగరత్నం గౌడ్ మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో మన వార్డులో కోటి 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను చేసుకున్నామని తెలిపారు. నేను కౌన్సిలర్ గా గెలిచిన రోజున మన వార్డులో ఒక్క సీసీ రోడ్డు కూడా లేదు అని, నీళ్ల సమస్య ఉంది అని, కానీ ఈరోజు ప్రతి వీధిలో సిసి రోడ్లు, మురికి కాలువలు, కరెంటు స్తంభాలు,ఐమాక్స్ లైట్లు, ఏర్పరుచుకున్నామని, తెలిపారు. అలాగే నీటి సమస్యను వందశాతం తీర్చుకున్నామన్నారు.   

నాకు రెండుసార్లు కౌన్సిలర్ గా అవకాశం ఇచ్చిన నా యొక్క వార్డు ప్రజలకు, మాజీ ఎమ్మెల్యేలు బాబు మోహన్ , చంటి క్రాంతి కిరణ్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల జైపాల్ రెడ్డి , మఠం బిక్షపతి, పార్టీ పెద్దలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version