దుద్యాల మండల ముదిరాజ్ అధ్యక్షుని ఎన్నిక…..
వికారాబాద్ జిల్లా కొడంగల్ ముదిరాజ్ భవనంలో కొడంగల్ ముదిరాజ్ తాలూకా అధ్యక్షుడు తలారి శేఖర్ ఆధ్వర్యంలో దుద్యాల మండలం ముదిరాజ్ అధ్యక్షునిగా రవికుమార్ ముదిరాజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రవికుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ నాకు ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూర వెంకటయ్య మాట్లాడుతూ ముదిరాజ్ సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు అన్ని రంగాల్లో మన ముదిరాజులు ముందుండాలని అన్నారు. అలాగే మన ముదిరాజులు ఐక్యమత్యంగా ఉండి మన హక్కులు సాధించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్ ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, పాల్గొన్నారు.