విద్యార్థులకు మోటివేషనల్ అవగాహన
కాగజ్ నగర్ పట్టణంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ ( ప్రేరణ తరగతులు) నిర్వహించబడ్డాయి. విద్యార్థులకు మోటివేషనల్ స్పీకర్ జయసింహ పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి వారికి అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఎలా అధిరోహించాలి? జీవితంలో ఎలా స్థిరపడాలి? సమాజంలో తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడానికి ఎలా కష్టపడాలి..? … తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
*
డ్రీమ్ చార్ట్ లో విద్యార్థి భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నాడో దానిని ఉన్నత ధ్యేయంగా పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పారు.
*
మీ కల ని బొమ్మ రూపం లో మీకు ఎప్పటికీ కనిపించేలా పెట్టుకుని ప్రేరణ పొందాలని సూచించారు
*
జీరో నుండి హీరో లుగా ఎదిగిన వారిని ఉదహరిస్తూ నేటి యువత సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదని చెపుతూ విద్యార్థుల్లో స్పూర్తి ని నింపారు
*
జ్ఞాపక శక్తి ఎలా పెంచుకోవాలో, చిట్కాలతో కొన్ని విషయాలు ఎలా గుర్తుంచుకోవచ్చో నేర్పించారు
*
విజయం సాధించడం లో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదన్నారు
*
ఆశయం, ఆలోచనలు గొప్పగా ఉండాలి. వాటిని బ్లూ ప్రింట్ గా మార్చుకుని ఆ దిశగా అడుగులు వేయాలి
*
నచ్చిన వాహనం, గొప్ప ఇల్లు, విలువ కలిగిన స్థానం, ఇష్టమైన ప్రొఫెషన్, మంచి సంపాదన ఇలా అన్నీ పొందాలనే సంకల్పంతో ముందుకు సాగాలి. వీటిని సాధించే దిశలో చదువు యొక్క ప్రాముఖ్యత గుర్తించాలి.
గొప్ప వాళ్లుగా ఎదుగుతూ ఈ సమాజానికి మీ వంతు తోడ్పాటు కూడా అందించాలి.
*
ఒక మామూలు ప్రయాణానికే మనం ఎన్నో ప్రణాళిక లు వేసుకుంటాం. అలాంటిది మరి మన జీవన ప్రయాణానికి ఎంతో మంచి ప్రణాళికలు వేసుకోవాలి కదా?
*
యుద్ధానికి ముందే ఓటమి అంగీకరించకూడదు. మొదటి స్థానము నాదే అని నమ్మి ఆ దిశగా కష్టపడాలి.
నీ ఆశయం ఉన్నతంగా ఉన్నప్పుడు, నీ కార్యాచరణ కూడా ఉన్నతంగానే ఉండాలి.
*
విద్యార్థులతో ఆడించిన నంబర్ మెమరీ గేమ్ పిల్లలని ఎంతగానో ఆకట్టుకుంది.
పిల్లలు కూడా ఉత్సాహంగ మెమరీ గేమ్ లో పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సురవర్ధన్, డైరెక్టర్ జియా ఉల్ హక్ మరియు డైరెక్టర్ వేద ప్రవీణ్, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.