మాగనూర్ మండల కేంద్రంలో లక్ష డప్పులు వేల గొంతులు సాంస్కృతిక మహా ప్రదర్శన వాల్ పోస్టర్లను విడుదల చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

మాగనూర్ మండల కేంద్రంలో లక్ష డప్పులు వేల గొంతులు సాంస్కృతిక మహా ప్రదర్శన వాల్ పోస్టర్లను విడుదల చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

 

నారాయణపేట జిల్లా మాగనూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర : ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమం వాల్ పోస్టర్ లను మాగనూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ మాగనూర్ మండల సినియర్ నాయకులు మణిగిరి కృష్ణ మాదిగ మాట్లాడుతూ* తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ తక్షణమే అమలు చేయాలని *ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ శ్రీ* *మందకృష్ణమాదిగగారి ఆదేశాల మేరకు* ఈ యొక్క లక్ష డబ్బులు వేయి గొంతుల కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని కావున ఈ యొక్క కార్యక్రమానికి మాదిగ మాదిగ ఉపకులాలు మాదిగ, మాదిగ ఉపకులాల్లో ఎదిగిన వంటి ప్రజాప్రతినిధులు ప్రతి మాదిగ సోదర సోదరీమణులు తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారుఅదేవిధంగా డప్పు కళాకారులు మరియు 

మాగనూర్ మండలం లోని అన్ని గ్రామాలు ఎస్సీ మాదిగ ప్రతి మాదిగ సామజిక వర్గం బిడ్డలు భుజాన డప్పును వేసుకొని మాదిగల సాంస్కృతిక చిహ్నంగా ఉన్నటువంటి డప్పును ప్రతి ఒక్కరూ విధిగా తీసుకొని రావాలని ప్రపంచంలోనే అతిపెద్ద భారీ సాంస్కృతిక మహా ప్రదర్శన లక్షల డప్పులతో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో మాదిగల ఆవేదనను ప్రపంచానికి చాటింపు చేస్తున్నామని తెలియజేశారుఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాగనూర్ మండల సినియర్ నాయకులు మనిగిరి కృష్ణ మాదిగ మగనూరు మండల సీనియర్ నాయకులు మణిగిరి క్రిష్ణ మాదిగ D ఆనంద్ మాదిగ 

దినేష్ మాదిగ T వాబయ్యమాదిగ కావాలి మొగుళప్ప మాదిగ G నర్సిములు మాదిగ అనిల్ మాదిగ బండారి క్రిష్ణ మాదిగ S వాబయ్య మాదిగ పెద్దింటి లక్ష్మణ్ మాదిగ

తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment