ప్రజావాణి కార్యక్రమంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే
అల్వాల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్ల సమస్యల పై స్థానిక ప్రజలు, కార్పొరేటర్లు, బి.ఆర్.ఎస్ నాయకులతో కలిసి కూకట్ పల్లి జోనల్ కమిషనర్ కారాయలంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో జడ్సి అపూర్వ చౌహాన్ ను కలిసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని ఏడు జెఎసి కాలనీల తీవ్రమైన డ్రైన్ ఔట్ లెట్ సమస్య, మంచినీటి సమస్యలు పరిష్కరించకుండా అధికారులు అవలంబిస్తున్న తీరును జడ్సీ సమక్షంలోనే ఎండగట్టిన ఎమ్మెల్యే, కనీస సౌకర్యాలు కలిపించకుండానే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అదికారులు అనుమతులివ్వడంతో, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక భారీ అపార్ట్ మెంట్ల నుండి వస్తున్న మురుగు ఈ ఏడు జేఏసీ కాలనీలలోకి చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారని, అధికారులు మాత్రం యదేచ్ఛగా లంచాలు తీసుకుని అనుమతులిస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే, అల్వాల్ ఇందిరా గాంధీ సర్కిల్ వద్ద జంక్షన్ అభివృద్ధిలో కూడా జాప్యం చేస్తున్నారని, అదేవిధంగా అక్రమ కట్టడాల పై చర్యలు తీసుకోవలసిన అధికారులు పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం పాకులాడుతు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని , స్థానిక అల్వాల్ డిప్యూటీ కమిషనర్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మారిపోయి ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతూ, విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశాడని, మరో పక్క ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతుంటే, అధికారులు మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులలో మార్పు రాకుంటే ప్రజలతో కలిసి అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నాకు దిగుతానని, ఎమ్మెల్యే హెచ్చరించడంతో స్పందించిన జోనల్ కమిషనర్ త్వరలోనే స్వయంగా తనే అల్వాల్ సర్కిల్ పరిధిలోని పర్యటించి సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ యం.బి.సి.డెవలప్మెంట్ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, సీనియర్ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమెశ్, లక్ష్మణ్ యాదవ్, అనిల్ కిషోర్, వెంకటేష్ జావేద్ యాదవ్ , సందీప్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సతీష్, సురేష్, హనుమాన్ చారి, తదితరులు పాల్గొన్నారు.