రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడు దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
04-02-2025 మంగళవారం రోజున జరిగే రథసప్తమి పర్వదినం సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తిరుమలగిరి లోని సూర్యభగవానుడి దేవాలయం లో ఏర్పాటు చేస్తున్న పనులను స్థానిక అధికారులు, పెద్దల తో కలిసి పరిశీలించి తగిన సూచనలు, సలహాలు చేశారు. సందర్భంగా శాసనసభ్యులు శ్రీగణేష్ మాట్లాడుతూ దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్. సి.బి. మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన్న ప్రతాప్, సీనియర్ నాయకులు మురళీ ముదిరాజ్, ఆలయ అర్చకులు, నిర్వాహకులు, పోలీస్ అధికారులు తదితరు పాల్గొన్నారు.