సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కలిసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ను నర్సాపూర్ నియోజక
వర్గ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి గచ్చు బౌలీ లోని ఆయన నివాసంలో మర్యాద
పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సునితారెడ్డి మాట్లాడుతూ.. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికైన మున్సిపల్ పాలక వర్గ పదవీ కాలం ఈ నెల 26వ తేదీన పూర్తయిన నేపథ్యంలో పాలకవర్గ సభ్యులతో వెళ్లి కలిశామన్నారు ,అనంతరం పదవీ విర
మణ పొందిన నర్సాపూర్ బల్దియా అధ్యక్షులు అశోక్ గౌడ్ ఉపాధ్యక్షులు నయీం ఉద్దీన్ కౌన్సిల్ సభ్యులను మాజీ మంత్రి హరీష్ రావు శాలువాలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ చంద్రా గౌడ్ ,నాయకులు సత్యం గౌడ్ ,షేక్ హుస్సేన్,మొహమ్మద్,చిన్న శ్రీనివాస్ యాదవ్ ,తొంటవినయ్ ,ఆనంద్ , బీఆర్
ఎస్ పట్టణఅధ్యక్షులు పంబల్లబిక్షపతి , కౌన్సిలర్ లు గొల్లరుక్కమ్మ ,సునితా
బాల్రెడ్డి ,లలితాబిక్షపతి,సరితా ఆంజ
నేయులు, పంబల్ల రాం చెందర్ ,యువ నాయకులుసద్దాం,జాన్రత్న ,తొంటవిక్కీ ,తదితరులు పాల్గొనడం జరిగింది.