రెజిమెంటల్ బజార్ ను ఎమ్మెల్యే శ్రీగణేష్ సందర్శించారు
నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంగళవారం రెజిమెంటల్ బజార్ లో పర్యటించారు ఎమ్మెల్యే శ్రీగణేష్. రెజిమెంటల్ బజార్ లోని గల్లీలలో కలియతిరిగి బస్తీలన్ని పరిశీలించి, స్థానికులతో, చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మల్యే.
రెజిమెంటల్ బజార్ లో ముఖ్యంగా డ్రైనేజీ సమస్య ఉందని, అలాగే రోడ్లు, వీధిదీపాలు కూడా సరిగా లేవని స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. అలాగే సికింద్రాబాద్ స్టేషన్ కు దగ్గరగా ఉండటంతో అపరిచితులు ఎక్కువగా సంచరిస్తుంటారని, ఇటీవల కొన్ని దొంగతనాలు కూడా జరిగాయని ఎమ్మెల్యే స్థానికులు వివరించారు.
సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని ఆదేశించారు. ఒక స్పెషల్ డ్రైవ్ లా నిర్వహించి చిన్న చిన్న సమస్యలన్ని త్వరగా పరిష్కరించే ఏర్పాటు చేయాలని డిసి సమయ్య కి సూచించారు ఎమ్మెల్యే. అలాగే రెజిమెంటర్ బజార్ లో సెక్యూరిటీ కోసం సిసి టివీలు ఏర్పాటు చేయిస్తామని ఎమ్మెల్యే హామి ఇచ్చారు. నిధుల విషయంలో ఏమైని ఇబ్బందులు ఉన్నా తను స్వయంగా ఆయా మంత్రులతో , ఉన్నతాధికారులతో మాట్లాడి తప్పకుండా సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే హామి ఇచ్చారు.
ఎమ్మెల్యే స్వయంగా తమ ఇంటి ముందుకొచ్చి సమస్యలు తెలుసుకోవడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు DC సమ్యయ్య, వాటర్ వర్క్స్ డిజిఎమ్ విద్యాసాగర్, ఏఇ చంద్రశేఖర్ , ఎలక్ట్రిసిటి ఏఇ శాంతి కుమార్ తో పాటు స్థానికి కాంగ్రెస్ నాయకులు సంతోష్ యాదవ్, నందికంటి రవి, బాబూరావు, అర్వింద్, రాము శ్రీనాద్ తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.