తిరుమలగిరి లో నిర్మాణంలో ఉన్న గ్రంథాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
కంటోన్మెంట్ నియోజకవర్గంలో బొల్లారం, తిరుమలగిరి లో నిర్మాణంలో ఉన్న గ్రంధాలయాలను ఎమ్మెల్యే శ్రీగణేష్ పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గ్రంధాలయాలను అత్యున్నత ప్రమాణాలను నిర్మిస్తున్నామని, బహుళ అంతస్తులలో నిర్మించి ఒక అంతస్తులలో పుస్తకాలు, లాప్‌టాప్ లాంటి ఆధునిక వసతులు విద్యార్ధులకు కల్పించడం తోపాటు యూపీఎస్సీ లాంటి పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విధ్యార్దులకు మరో అంతస్థులో అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్యాలిఫైడ్ ఫాకల్టీతో లెక్చర్స్, గైడెన్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా గ్రంధాలయాలను తీర్చిదిద్దేందకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రతి పేద విద్యార్ది కార్పోరేట్ కళాశాలలు, లక్షల రూపాయల ఫీజులు తీసుకునే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్ల లోని విద్యార్దులతో పోటీ పడి కాంపిటీటివ్ పరీక్షల్లో విజయం సాధించడానికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తామని, విజయానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏఇ ప్రసాద్, డిఇ బుగ్గయ్యగౌడ్ పాల్గొన్నారు.