స్వామీ వివేకానంద జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…..
ఈ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి , కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.