ఓపెన్ డ్రైన్ ఆర్సీసీ బెడ్ సైడ్ వాల్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.అరెకపూడిగాంధీ కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి

ఓపెన్ డ్రైన్ ఆర్సీసీ బెడ్ సైడ్ వాల్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.అరెకపూడిగాంధీ కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి

 

ప్రజా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం

 

అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు

 

 

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి నల్లగండ్ల లో శుక్రవారం నాడు రూ.28 కోట్లు 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఆర్‌సీసీ బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులకు శంఖుస్థాపన చేసిన పీఏసీ చైర్మన్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ,గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ 

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నల్లగండ్ల చెరువు నుండి బీహెచ్ఈఎల్ చౌరస్తా గ్యాస్ గోడౌన్ నాల వరకు ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో హైటెక్ సిటీ లో భాగంగా రూ. 28 కోట్లు 45 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా చేపట్టబోయే ఓపెన్ డ్రైన్ ఆర్‌సీసీ బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం పనులకు పీఏసీ చైర్మన్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ మరియు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్యఅతిథిలుగా పాల్గొని శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీని,గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాదర్ రెడ్డిని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ వరద నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నాలాల విస్తరణ పనులు చేపట్టడం ద్వారా లోతట్టు మరియు ముంపు ప్రాంతాలకు స్థిరమైన ఉపశమనం కల్పించనున్నామని తెలిపారు.బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి, రాబోయే వర్షాకాలానికి ముందే స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శరవేగంగా విస్తరిస్తున్న గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా నిలుపుతున్నామని అన్ని అన్నారు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డివిజన్ పరిధిలో శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు..

సమస్యలను ఒక్కొకటిగా అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం చూపుతున్నామని అన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా ఆదర్శవంతమైన గచ్చిబౌలి డివిజన్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతీ బస్తీ, కాలనీల్లో కోట్ల నిధులు వెచ్చించి మంచినీరు, రోడ్లు, కరెంటు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే దిశగా తమ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి చెప్పడం జరిగినది.అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం పెరగాలని కోరారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు డిఈ ఆనంద్, ఈఈ దుర్గా ప్రసాద్, ఎస్.ఎన్.డి.పి డిఈ రాజు, ఎస్.ఎన్.డి.పి ఈఈ సత్యనారాయణ,గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు తిరుపతి,చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి ,నరేందర్ బల్ల ,సీనియర్ నాయకులు శేఖర్, సుమన్, శంకర్, శ్రీను,డివిజన్ నాయకులు , మహిళ నాయకులు ,మహిళ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు,కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు, అభిమానులు,కాలనీ వాసులు స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment