ఎం జె పి టీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ (బాలుర ) స్కూల్ విద్యార్థుల ఫీల్డ్ విజిట్ 

ఎం జె పి టీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ (బాలుర ) స్కూల్ విద్యార్థుల ఫీల్డ్ విజిట్ 

 

హనుమకొండ జిల్లా కమలాపూర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు తమ క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం ములకనూరు మహిళా స్వశక్తి పాల డైరీ, ముల్కనూరు రైతు సహకార గ్రామీణ బ్యాంకు సందర్శించారు. జిన్నింగ్ మిల్లు లో పత్తి బెళ్ళు ఏర్పడటం పరిశీలించారు. పాల డైరీలో పాలను సేకరించేవిధానం, పాశ్చరైజేషన్ ప్యాకింగ్ తయారీ, విధానం, ఇతర తీపి పదార్థాల తయారీని కూడా విద్యార్థులకు అక్కడి సిబ్బంది వివరించారు. మహిళా స్వశక్తి డైరీ సాధించిన ప్రగతి, విజయాలు, ప్రస్థానం రికార్డులు పాల ఉత్పత్తిలో పురోగమిస్తున్న తీరును డాక్యుమెంటరీ ద్వారా వివరించారు. తదనంతరం గ్రామీణ సహకార బ్యాంకులో విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా ముల్కనూరు గ్రామీణ బ్యాంకు నేపథ్యాన్ని వివరించారు. అక్కడి నుంచి నేరుగా కొత్తపల్లిలో గల విత్తనోత్పత్తి కేంద్రానికి చేరుకొని విత్తన ఉత్పత్తి ప్రక్రియ ఎలా జరుగుతుంది..? దానిలోని అంశాలు, ప్యాకింగ్ తదితర విషయాలను విద్యార్థులు పరిశీలించారు. విద్యార్థుల క్షేత్ర పర్యటన చాలా ఆహ్లాదంగా ఆనందంగా జరిగింది. ఈ పాఠశాల ”పీఎం శ్రీ” పథకంలో ఎంపికైనందున విద్యార్థులకు క్షేత్ర పర్యటనలు, సందర్శనలు చేయాల్సి ఉన్నందున గ్రామీణ నేపథ్యం, రైతుల పరస్పర సహకారం,ఆర్థిక స్వావలంబన దృష్ట్యా ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద బ్యాంకుకు పేరు ప్రఖ్యాతి గడించిన బ్యాంకుకు తీసుకురావడం జరిగింది. కమలాపూర్ ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ తాడూరి రవీందర్, వైస్ ప్రిన్సిపల్ మంగ, 620 మంది విద్యార్థులు, 30 మంది ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సంగీతం, హస్తకళలు,చిత్రలేఖనం,ఆరోగ్య పర్యవేక్షకులు, పాఠశాల సిబ్బంది ఈ క్షేత్ర పర్యటనలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment