ఉపాధి కూలీల మృతి పట్ల మంత్రి కొండ సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు!!
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని గోవర్ధనగిరిలో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు తమ పనుల్నో నిమగ్నమై వుండగా ప్రమాదవశాత్తు మరణించడంతో పాటు పలువురు గాయపడం పై మెదక్ జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన పై సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తో ఫోన్లో మాట్లాడి, దుర్ఘటనకు దారితీసిన పరిస్థితుల పై ఆరా తీశారు. ఉపాధి హామీ పథకం కింద నిబంధనల ప్రకారం కూలీలకు అందించాల్సిన ఆర్థిక సహాయం, ఇతర సహకారాల పై కలెక్టర్ తో మంత్రి సురేఖ చర్చించారు. మృతులతో పాటు క్షతగాత్రులకు ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయం, ఇతర వెసులబాట్లు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రుల కోరిక మేరకు వారికి ఇష్టమున్న చోటే వైద్య సౌకర్యం పొందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తీవ్రంగా గాయపడి వరంగల్ జిల్లా ఎంజిఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న స్వరూప ఆరోగ్య పరిస్థితిని మంత్రి సురేఖ ఆరా తీశారు. ఎంజిఎం హాస్పిటల్ సూపరిండెంట్ కిశోర్ తో ఫోన్లో మాట్లాడి ఆమెకు అందుతున్న వైద్యం పై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా కుదుటపడేదాకా చికిత్సను కొనసాగించాలని ఆదేశించారు. స్వరూపకు చికిత్స కొనసాగినన్ని రోజులు ఆమె భర్తకు ఆహారం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.