ఆయా శాఖల అధికారులతో కలిసి అమర వీరుల స్మారక దినోత్సవం
… అదనపు కలెక్టర్ నగేష్, డి ఆర్ ఓ భుజంగారావు
గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు ఇతర శాఖల జిల్లా అధికారులతో కలిసి అమర వీరుల స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు.భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటంలో తమ ప్రాణాలను అర్పించిన అమర వీరుల జ్ఞాపకార్థం రెండు నిముషాలమౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు,కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.