మట్కారాయుడు అరెస్ట్ , మట్కా , జూదం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం…. టౌన్ సీఐ రాజేంద్రప్రసాద్
కాగజ్ నగర్ పట్టణంలోని మట్కా ఆడుతున్న యువకుడిని అరెస్టు చేసి నట్టు టౌన్ సీఐ పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు మంగళవారం పట్టణంలోని బాలాజీన గర్ లో ఆకస్మిక తణిఖీలు చేయగా, పోతుల సాయికిరణ్ అనే యువకుడు తన ఇంటి వద్ద ఆఫ్ లైన్, ఆన్లైన్ మట్కా ఆడుతూ పట్టుబడ్డాడ ని చెప్పారు. అతని వద్ద ఉన్న మట్కా చిట్టీలు, మొబైల్ ఫోన్, కెమెరా స్టాండ్, ఒక ప్రింటర్, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి, బుధవారం కాగజ్ నగర్ తాసిల్దార్ ఎదుట బైండోవర్చేసినట్టు వివరించారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ మట్కా జూదం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు