శ్రామిక నగర్ కాలనీ అభివృద్ధికి కృషి- ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

శ్రామిక నగర్ కాలనీ అభివృద్ధికి కృషి- ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

 

 

మౌలాలి డివిజన్ పరిధిలోని శ్రామిక నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మౌలాలి డివిజన్ పరిధిలోని ఇస్రామిక నగర్ లో ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటుచేసిన శ్రామిక నగర్ కాలనీ ముఖద్వారాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం కాలనీలో పాదయాత్ర చేసి స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు శ్రామిక నగర్ కాలనీలో ఉన్న సుమారు 18 వందల గజాల స్థలంలో రాళ్లు గుట్టలు ఉన్నాయని వాటిని తొలగించి కాలనీ అభివృద్ధికి పార్కు మరియు దాంట్లో కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలని శ్రామిక నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేను కోరారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రణాళికబద్ధంగా పార్కు స్థలం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు అమీరుద్దీన్, భాగ్యనందరావు, సందీప్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మొహమ్మద్ గౌస్ భాయ్, అబ్దుల్ హమీద్, కొంతం శ్రీనివాసరావు, హేమంత్ కుమార్, అబ్దుల్ రెహమాన్, షేక్ కరీం, కొండయ్య, రామ్ రెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment