గొంతు కోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో గొంతు కోసుకొని యువకుడు ఆత్మహత్యాయత్నంకి ప్రయత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గుడికందుల రాము (34) అనే యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు 108 కి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం అతన్ని అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇంకా అసలు ఆ యువకుడు ఆత్మహత్య యత్నంకు ఎందుకు పాల్గొన్నడో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.