ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్దంతి వేడుకలు

ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్దంతి వేడుకలు

 

పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తాజా మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్

 

 

జాతిపిత మహాత్మా గాంధీ శాంతి, సత్యాగ్రహం పద్దతులలో దేశ ప్రజలను ఏకంచేసి స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపించి, దేశానికి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చారని తాజా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాలతో మహాత్మాగాంధీ 77 వ వర్దంతి సందర్భంగా ఎంజి రోడ్ లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి కక్కిరేణి శ్రీనివాస్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కక్కిరేణి శ్రీనివాస్ మాట్లాడుతూ అహింసను ఆయుధంగా చేసుకుని దేశప్రజలలో చైతన్యం నింపి మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలకుల నుండి దేశానికి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చారని, ఎటువంటి మీడియా ‌లేని రోజుల్లో రేడియో ను ప్రచార మాధ్యమంగా చేసుకున్నారని అన్నారు. గాంధిజి భోదించిన సత్యం, ధర్మం, గ్రామ స్వరాజ్యం నేటి తరానికి ఆదర్శం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, చివ్వెంల మండల పార్టీ అధ్య ధరావత్ వీరన్న నాయక్, తాజా మాజీ కౌన్సిలర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, బచ్చలకూరి శ్రీనివాస్, నాగుల వాసు, ఇఫ్రార్ అహ్మద్, కుందమళ్ల శేఖర్, రాంరెడ్డి, చంద్రారెడ్డి, దామోదర్ రెడ్డి, కొరివి వెంకన్న, ఆలేటి మాణిక్యం, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version