యువత గంజాయి కి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని గోదావరిఖని టూ టౌన్ సిఐ ఎం ప్రసాదరావు కమాన్ పూర్ ఎస్సై కొట్టే ప్రసాద్ లు అన్నారు. శనివారం రాత్రి కమాన్ పూర్ మండలం రొంపి కుంట గ్రామంలో పోలీస్ కళాబృందం చే కళా ప్రదర్శన నిర్వహించారు. ఇందులో మూఢనమ్మకాలు గంజాయి సైబర్ నేరాలు తోపాటు మంత్ర తంత్రాలపై కళాబృందం వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రసాదరావు కొట్టే ప్రసాద్ లు మాట్లాడుతూ నేటికీ గ్రామాల్లో మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయని వాటిని విడనాడాలని అన్నారు. అలాగే చాలా వరకు సైబర్ క్రైమ్ లో జరుగుతున్నాయని ఏదైనా ఓటిపి వస్తే ఎవరికి కూడా చెప్పకూడదని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నేడు యువత పెడదారిన పడుతున్నారని గంజాయి డ్రగ్స్ మద్యానికి అలవాటు పడుతున్నారని వాటిని విడనాడాలని అన్నారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కటకం రవీందర్క,మ్మగొని మల్లయ్య, చిందం తిరుపతి తోపాటు సిబ్బంది వెంగళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.