యువత క్రీడల్లో రాణించాలి అని యూత్ కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు రాజు కుమార్ రెబల్ అన్నారు. కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి లో యువకులకు దుద్దిళ్ళ శ్రీపాదరావు జ్ఞాపకార్థం షటిల్ నెట్, బ్యాట్స్, కాక్ మరియు షటిల్ కిట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రెబల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ యువకులను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు మరియు శీను బాబుల సహకారంతో చేయూతనివ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే యువతకు క్రికెట్ కిట్లు వీలైతే ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు చొప్పరి సంతోష్ ,సాయి, కిట్టు గౌడ్, శివాజీ యాదవ్, అజయ్, నిఖిల్, సందీప్, రఘు, వెంకటేష్, బన్నీ, అనిల్, భరత్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు .