విద్యాభారతి పాఠశాలలో భక్తి శ్రద్ధలతో వినాయకునికి పూజలు.

విద్యాభారతి పాఠశాలలో భక్తి శ్రద్ధలతో వినాయకునికి పూజలు.

మహబూబాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

 

జమాండ్లపెల్లి గ్రామంలోని విద్యాభారతి పాఠశాలలో శనివారం వినాయకుని పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ తక్కెళ్ళపెల్లి విజిత ప్రభాకర్ రావు దంపతులు మరియు తక్కెళ్ళపెల్లి మాధవి వెంగళరావు దంపతులు పూజలో పాల్గొన్నారు. వేదమంత్రాలతో క్రతువు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు వితరణ గావించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 

 ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఆశిష్ రావు, అభినయ్ రావు, అనిక్ రావు, ఉపాధ్యాయులు ప్రదీప్, గుండోజు దేవేందర్, యాకయ్య, మోహన్, లాల్ పాషా, రాజేష్, సుమన్, స్వామి కుమార్, అనూష, భవానీ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment