ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడీగా పోటీ చేస్తున్న చెరుకుపల్లి నరేందర్ ను గెలిపించండి.

ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడీగా పోటీ చేస్తున్న చెరుకుపల్లి నరేందర్ ను గెలిపించండి.

 

-మండల కాంగ్రెస్ నాయకుల పిలుపు.

 

బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

 

భారత జాతీయ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్ఫూర్తితో నేటి యువత పార్టీ కి ప్రాతినిథ్యం వహిస్తూ, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఇల్లందు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రలోభాలకు,లొంగకుండా,అనుక్షణం పార్టీ సంస్థాగత నిర్మాణం కొరకు,పార్టీ బలోపేతానికి, అంకితభావంతో పనిచేస్తూ,యువతలో ఎప్పటికప్పుడు చైతన్యాన్ని కలిగించి యువ నాయకుడిగా ఎదుగుతున్న చెరుకుపల్లి నరేందర్ నీ గెలిపించాలని బయ్యారం కాంగ్రెస్ నాయకులు ఒక ప్రకటనలో కోరారు.పార్టీ పట్ల యువత పట్ల సమగ్ర బాధ్యత,సమగ్ర విశ్లేషణ కలిగిన వ్యక్తికి అండగా ఉండాలని తెలిపారు.యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిపించాలని దళిత కుటుంబంలో పుట్టి నియోజకవర్గంలో అందరికి నోటిలో నాలుకల మెదులుతూ అందరి కష్టాలు తన కష్టాలుగా భావించి అందరికి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలిసిన వారిగా సేవలు అందిస్థున్నట్లు తె‌లిపారు,నాయకత్వ లక్షణాలు కలిగినవాడు,ప్రజా సమస్యల పరిష్కారానికై నిరంతరం శ్రమించేవాడు.పార్టీ లో కార్యకర్తలను ప్రేరేపిస్తూ వారికి వారి లక్ష్యాలను గుర్తు చేస్తూ అందరికీ ఆదర్శంగా,సమాజం పట్ల,బాధ్యత కలిగిన చెరుకుపల్లి నరేందర్ కు అండగా నిలబడాలని కోరారు.  

 ప్రజల సమస్యల విషయంలో అందరికి చెదోడు వాదోడుగా ఉంటూ ఇల్లందు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడుగా ఎన్నుకొని కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి ధరి చేరేలా ఇందిరమ్మ రాజ్యం కోసం ఇల్లందు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కోసం సహాయ సహాకారాలు,అందించాలని,యువతకు,పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నర్సయ్య, అలెగ్జాండర్, శ్రీను,ఉపేందర్ ,నాగమణి,ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment