అక్కరకురాని బొమ్మలను తొలగిస్తాం.. తెలంగాణ తల్లిని ప్రతిష్టిస్తాం:కేటిఆర్
హైదరాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
అక్కరకురాని బొమ్మలను తొలగిస్తాం.. తెలంగాణ తల్లిని ప్రతిష్టిస్తాం:కేటిఆర్
సీఎం రేవంత్ పై ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది.దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్ అయి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే.తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం’ అని కేటిఆర్ పేర్కొన్నారు.