ఇల్లు కాలిపోయి రోడ్డున పడ్డామని తమకు ఇందిరమ్మ గృహం ఇప్పించాలని కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన కంజుల స్వరూప తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. నా యొక్క భర్త అయినా కౌజుల శ్రీనివాస్ కు మతిస్థిమితం లేక తమ ఇంటికి నిప్పు పెట్టినాడని వినతిపత్రంలో పేర్కొన్నారు. దీంతో ఇంట్లో సామాగ్రి మరియు నగదు పూర్తిగా కాలిపోయిందని పేర్కొన్నారు. తమ భర్త అనారోగ్యంతో బాధపడుతుండగా అతని చికిత్స నిమిత్తం 10 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. తమకు ఇందిరమ్మ గృహం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రోడ్డున పడ్డాం ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి
Published On: November 26, 2024 12:54 pm