మీ ఆయుష్షు పెరగాలంటే వారానికి ఎన్ని అడుగులు నడిస్తే సరిపోతుంది.
హైదరాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం అందరికీ చాలా ముఖ్యం. ముఖ్యంగా మన శరీరం చురుకుగా ఉండాలి, జబ్బులు రాకుండా ఉండాలి, మనం ఎల్లప్పుడూ కూడా అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలి అంటే మనము కొన్ని వ్యాయామాలు చేయాల్సిందే. చాలామందికి చాలా సులభమైన వ్యాయామం నడక. ఇది ఎంతో ప్రభావంవంతంగా పనిచేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుండి బయట పడేస్తుంది. అయితే వారంలో ఎన్ని అడుగులు వేస్తే మన ఆయుష్షు పెరుగుతుంది తెలుసుకుందాం.
-వారానికి మూడుసార్లు 5000 అడుగులు.
వారానికి కనీసం మూడుసార్లయిన 5000 అడుగులు నడిస్తే మన ఆయుష్షు పెరుగుతుందని పరిశోధనలు తేలింది. గుండె జబ్బులు, షుగర్ వ్యాధి, పక్షవాతం డిప్రెషన్ వంటి వ్యాధులతో బాధపడే వారికి కూడా ఈ నడక ద్వారా ఈ వ్యాధులను నయం చేసుకోవచ్చు.
అయితే యుక్త వయసులో ఉన్నవారు ప్రతిరోజు 10,000 అడుగులు నడిస్తే ఇంకా ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తాయి, అయితే వయసు పెరిగిన వారిలో ఈ పదివేల అడుగులు వేయడానికి కాస్త ఇబ్బంది ఉన్నప్పుడు వారంలో కనీసం మూడుసార్లు అయినా ఐదు వేల అడుగుల చొప్పున 15 వేల అడుగులు వేస్తే సరిపోతుంది. దీని ద్వారా మీరు అనేక జబ్బుల నుండి బయటపడి ఆయుష్షును పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
కొన్ని నెలలపాటు నిర్వహించిన పరిశోధనలో వారంలో మూడుసార్లు ఐదువేల అడుగులు నడవడం అలవాటు చేసుకున్న వ్యక్తి తన జీవిత కాలాన్ని మూడు సంవత్సరాలు పొడిగించుకోగలడని వెళ్లడయింది.
నడక వల్ల ప్రయోజనాలు: ప్రతిరోజు నడవడం ద్వారా మన శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఎల్లప్పుడూ కూడా ఉత్సాహంగా ఉంటాము. రోజువారి పనులను సులభంగా చేసుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మన గుండె స్పందన రేటును మెరుగుపరుస్తుంది. అంటే కాకుండా బిపి పేషెంట్స్ కి రక్తపోటును తగ్గించడానికి ఈ నడక సహాయపడుతుంది. అధిక బరువుతో బాధపడే వారు కూడా ప్రతిరోజు నడవడం వల్ల బరువు తగ్గి అనేక రకాలైన జబ్బుల నుండి బయటపడతారు. ఆందోళన డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉన్నవారు కూడా ప్రతిరోజు నడవడం ద్వారా ఆ సమస్య నుండి బయటపడతారు.