సూర్యాపేట పట్టణ ప్రజలు వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిమజ్జనం కార్యక్రమంలో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ఊరేగింపులు నిర్వహించాలని సూర్యాపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 44 వ వార్డులో నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద సుమన్ మెడికల్ యామా ప్రభాకర్ మరియు పబ్లిక్ క్లబ్ ఇసి మెంబర్ రాచకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ పూజా కార్యక్రమంలో కక్కిరేణి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలలో స్ధానిక పెద్దలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని నవరాత్రి ఉత్సవాలను కమిటీ అధ్యక్షుడు వీరారెడ్డి ఆధ్వర్యంలో వ ఘనంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.