ఓసిపి-2 కార్మికుల ఆధ్వర్యంలో సెంటినరీ కాలనీ మార్కెట్లో వన మహోత్సవ కార్యక్రమం

రామగిరి మండలం సెంటినరీ కాలనీ లోని ఓసీపీ 2 సింగరేణి కార్మికుడు  గదం ప్రభాకర్ పుట్టిన రోజు సందర్భంగా వారి మిత్ర బృందం గౌడ సత్యం  ఆధ్వర్యంలో  సెంటినరీ కాలనీలోని అంగడి బజార్ నందు మొక్కలు నాటడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి  మాట్లాడుతూ  ప్రజా ప్రభుత్వం పిలుపులో భాగంగా వన మహోత్సవ కార్యక్రమంలో  ఘనంగా జరుగుతుంది అని అన్నారు. పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుత కాలంలో మిత్రులతో కలిసి విందు పార్టీలు జరుపుకుంటున్న  విధానం కాకుండా మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డ్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మిత్రులు చేపట్టడం చాలా అభినందనీయమని మరియు ప్రకృతిని భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన అవసరం ఈ తరానికి ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా తమ తమ మధుర జ్ఞాపకాలను ప్రకృతితో  మమేకమయ్య  విధంగా  జరుపుకోవాలని తెలియజేశారు. మీ మధుర జ్ఞాపకాలలో ఇట్టి కార్యక్రమాలు చేయాలనుకునేవారు గౌడ సత్యం సంప్రదించినట్లయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో  ఫోర్మెన్ వెంకటేశ్వర్లు,సమ్మయ్య, వైష్ణవి,భవిత,బుడిగే క్రాంతి,మేకల మారుతి ,సిద్ధం మురళీ,రాజు లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment