పోగొట్టుకున్న రెండు మొబైల్ ఫోన్లు తిరిగి బాధితులకు అప్పగింత

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి, రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కల్వచర్ల మరియు సేంటినరీ కాలనీ గ్రామాలలో ఇద్దరు వ్యక్తులు బండారి కోంరయ్య కల్వచర్ల గ్రామం మరియు ఆవుల అనిల్, గోదావరిఖని గ్రామం అనువారు దాదాపు కొన్ని నెలల క్రితం వారి యొక్క మొబైల్ ఫోన్లు పోయినాయి అని సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసినారు. వారి యొక్క మొబైల్ ఫోన్లను ,(వివో అండ్ ఒప్పో)  సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి తిరిగి వెంటనే వాటిని స్వాధీనం చేసుకొవడం జరిగినది. వాటిని వెంటనే  మొబైల్ ఫోన్ బాధితులను పిలిచి పోలీస్ స్టేషన్లో అందజేయడం జరిగింది.ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకున్న ఎడల వెంటనే అట్టి వివరాలను  సిఈఐఆర్ ఫోటోలో నమోదు చేస్తే అట్టి ఫోన్లను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవరికైనా మొబైల్ ఫోన్లు దొరికితే వాటిని వెంటనే పోలీస్ స్టేషన్లో అందజేయగలరు అని ఎస్ఐ సందీప్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment