జాతీయస్థాయి చదరంగ పోటీలకు ఎంపికైన త్రివేణి పాఠశాల విద్యార్థి ని*

*జాతీయస్థాయి చదరంగ పోటీలకు ఎంపికైన త్రివేణి పాఠశాల విద్యార్థి ని*

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సూర్యాపేట ప్రతినిధి నవంబర్: 11

అక్టోబర్ నెల 7 8 తేదీల్లో మేడ్చల్లో నిర్వహించిన 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి చదరంగ పోటీల్లో త్రివేణి పాఠశాల విద్యార్థిని కప్పల ఇందిర జాతీయస్థాయి చదరంగ పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్ హరి తెలిపారు. సోమవారం పాఠశాల ఆవరణలో అభినందన సభ నిర్వహించి కోచ్ ఎడవెల్లి అనిల్ తో పాటు విద్యార్థిని ఇందిరను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ ఈనెల 17 నుండి 21 వరకు మధ్యప్రదేశ్ లో జరిగే జాతీయస్థాయి చదరంగ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. మా పాఠశాలలో విద్యతోపాటు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. గతంలో త్రివేణి పాఠశాల నుండి ఎంతోమంది విద్యార్థులు జాతీయస్థాయిలో గెలుపొంది ఉన్నత శిఖరాల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినికి 15 వేల రూపాయలు నగదు బహుమతితో పాటు 10 తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment