సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత ఎనిమిది రోజులుగా ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని సూర్యాపేట డిఎస్పి రవి అన్నారు. ఆదివారం పట్టణంలోని 46వ వార్డులో ఆంగోతు భావ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేడు నిర్వహించే గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దూరప్రాంతాలకు వెళ్లకుండా సూచించిన సమీప ప్రాంతాల్లో నిమజ్జనం చేయాలన్నారు. సూచించిన రూట్ మ్యాప్ ఆధారంగా విగ్రహాలను క్రమ పద్ధతిలో నిమజ్జన ప్రదేశానికి తీసుకువచ్చి నిమజ్జనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మద్దూరి సుధాకర్, కార్యవర్గ సభ్యులు పబ్బా ప్రకాష్, మాడూరి ఉపేందర్, శ్రీరంగం కళ్యాణ్, చిట్టి పాక రాములు, వెంకటేశ్వర్లు, నర్ర రాఘవరెడ్డి, ఉన్నం సత్యనారాయణ, మద్ది సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.
నేడు గణేష్ నిమజ్జోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి
Published On: September 15, 2024 5:20 pm