బుధవారం పౌర్ణమి రోజు చంద్రగ్రహణం లేదు: వేణుగోపాల చార్యులు

 

18వ తేదీ బుధవారం రోజు చంద్రగ్రహణము ఉన్నట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారని 18వ తేదీ బుధవారం ఎటువంటి గ్రహణము లేదు అని ప్రజలు గమనించవలసిందిగా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలచార్యులు తెలిపారు. అమెరికా మరియు ఇతర దేశాలలో మాత్రమే ఈ గ్రహణం కనపడుతుంది అని భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కనుక ఎవరు గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదని వారు తెలిపారు. కొన్ని మీడియాలలో దీనిమీద ప్రజలను అనవసరముగా తప్పుదోవ పట్టిస్తున్నారని అలాంటి వాటిని నమ్మవలసిన అవసరం లేదని వారు తెలిపారు. రోజువారీగానే నిత్య పనులు యధావిధిగా జరుపుకోవాలని వేణుగోపాలాచార్యులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment