రైతు సంక్షేమమే దుద్దిళ్ళ ఎజెండా

దశాబ్ధ కాలం పైగా పోరాటం చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న రాజాపూర్,బుధవారం పేట గ్రామ రైతులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో 708.16 ఎకరాల రైతులకు నూతన పాసుపుస్తకాలు రానున్నాయి.ఇన్నాళ్ళూ ఎన్నో  పోరాటాలు చేసిన తమకి నూతన పాసుపుస్తకాలతో పాటు ఇక నుండి రైతుకు సంబంధించిన రైతు బంధు,రైతు భీమా,క్రాప్ లోన్స్ మరియు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందబోతున్నాయని తెలిసి రైతులు హర్షం వ్యక్తం చేసారు.రైతులు కృతజ్ఞతగా మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు  చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ రైతుల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి మంత్రి శ్రీధర్ బాబు అని రానున్న రోజుల్లో రాజాపూర్, బుధవారం పేట  గ్రామ రైతులకు మరింతగా న్యాయం చేయడానికి మంత్రి శ్రీధర్ బాబు  కృషిచేస్తున్నారన్నారు.దేశానికి రైతు వెన్నెముక అని అలాంటి రైతులకు ఎంతచేసినా తక్కువే అని శ్రీధర్ బాబు  ఆ విషయం లో ముందు వరుసలో ఉంటారన్నారు.ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపు , రాజాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు పుల్లెల కొమురయ్య,తాజా మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క – కొమరయ్య గౌడ్, మాజీ సర్పంచ్,వి.ఎస్.ఎస్ చైర్మన్ బుద్దర్తి బుచ్చయ్య పటేల్,మాజీ జడ్పీటీసీ ఏల్లె రామ్మూర్తి,రామగిరి మండల బీసీ సెల్ అధ్యక్షులు బండారి సదానందం,రామగిరి మండల ప్రచార కన్వీనర్ ముస్త్యల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ ఎరుకల బాబురావు,మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉపసర్పంచ్ వేగోలపు శ్రీనివాస్,రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్,తాజామాజీ సర్పంచ్ దేవునురి రజిత శ్రీనివాస్,తాజా మాజీ సర్పంచ్ మొగిలి నరేష్ యాదవ్, రాజాపూర్ గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ యాదవ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లెల సతీష్,పాశం కొమరయ్య,మాజీ ఉప సర్పంచ్ ఎం.డిచోటమియా, బావు రాజమల్లు,రాజాపూర్ గ్రామ మహిళ కాంగ్రెస్ నాయకురాలు మొగిలి రేణుక, నుట్టూరి స్వరూప మరియు రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment