రాష్ట్రస్థాయిలో రెండు అవార్డులను పొందిన సూర్యాపేట జిల్లా సాక్షి స్టాఫ్ ఫోటో గ్రాఫర్ అనమాల యాకయ్య ను జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆయన చాంబర్ లో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాక్షి ఫోటోగ్రాఫర్ ఎంతో ఇష్టంగా తను చేసే వృత్తిలో తన నైపుణ్యాన్ని గుర్తించేలా ఫోటోలు తీసి రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డులు పొందడం సంతోషించతగ్గ విషయం అన్నారు.మరొన్నో మంచి మంచి ఛాయ చిత్రాలను తీస్తూ ప్రతిభను కనబరుస్తూ రాష్ట్రస్థాయిలో మరెన్నో అవార్డులను పొందాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను ప్రజల్లో చేరవేసేందుకు ముందు వరుసలో ఉండాలన్నారు. జిల్లాలో ఉండే ప్రజల సమస్యలను ప్రభుత్వా అధికారులకు ప్రజలకు వారధిగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే (హెచ్ – 143) జిల్లా అధ్యక్షులు వజ్జె వీరయ్య, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్ గుప్తా, చంద్రశేఖర్, ఎడ్వర్డ్, జహంగీర్, శ్యాంసుందర్ రెడ్డి,శిగ సురేష్ గౌడ్, ఫణిoద్ర, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయిలో అవార్డు పొందిన అనమాల యాకయ్యను సన్మానించిన జిల్లా కలెక్టర్
Updated On: August 27, 2024 10:03 pm