రుణమాఫీ- 2024 లో భాగంగా రైతు కుటుంబ నిర్ధారణ ప్రక్రియ లో భాగంగా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో రుణమాఫీ ప్రక్రియను జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆది రెడ్డి పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా రామగిరి మండలం లో ఉన్న బ్యాంకులలో రుణం తీసుకున్న కల్వచర్ల గ్రామానికి చెందిన రైతులు రేషన్ కార్డు లేని వారు కుటుంబ నిర్ధారణ లో భాగంగా కుటుంబంలో అందరి సభ్యుల ఆధార్ కార్డులు, ధ్రువీకరణ పత్రాలు మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ కి అందించడం జరిగింది. రుణమాఫీ కి సంబంధించిన ఆప్ లో సంబంధిత పత్రాలు అప్లోడ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈవో అరవింద్, గంట వెంకటరమణ రెడ్డి ,రైతులు పాల్గొన్నారు.
రుణమాఫీ ప్రక్రియను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి
Published On: August 28, 2024 1:41 pm