కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆది వరహస్వామి వద్ద ఆదివారం భక్త జన సందోహం తో కిటకిటలాడింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి వద్ద వివిధ గ్రామాల నుండి ప్రజలు భారి ఎత్తున హాజరయ్యారు. అలాగే ప్రధాన పూజారి రామానుజ చార్యులు ఆధ్వర్యంలో అభిషేకం పూజలు నిర్వహించారు. స్వామి వారి వద్ద పలువురు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల కొరకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో కాంత రెడ్డి సిబ్బంది సంతూ మల్లేష్ శ్రీనివాస్ ఏర్పాట్లను చూశారు. ఈ ఆదివారం రోజున సెటినరీ కాలనీ 8 కాలనీ కరీంనగర్ పెద్దపల్లి మంథని తదితర ప్రాంతాల నుండి భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు.