వెల్ఫేర్ బోర్డు నిధులను ఎల్ఐసి కి ఇవ్వాలన్న నిర్ణయాన్ని  వెంటనే ఉపసంహరించుకోవాలి

భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులన ఎల్.ఐ.సి కి ఇవ్వాలన్న  నిర్ణయాన్ని  ప్రభుత్వం  వెంటనే ఉపసంహరించుకోవాలని  భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం అధ్యక్షులు చిలువేరు స్వామి అన్నారు. రామగిరి మండలంలో  కార్మికులతో కలిసి స్వామి మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డులో నిల్వ ఉన్న 3600 కోట్ల రూపాయలు ఉన్న వెల్ఫేర్ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికులకు దక్కకుండా చేయడానికి ఎల్ఐసి కి ఇవ్వాలనే తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనేఉపసంహరించుకోవాలన్నారు. వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులను కార్మికులు (పనిముట్లు)యంత్రాలను కొనుక్కునేందుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. చాలావరకు  కన్స్ట్రక్షన్స్ నిర్మాణములన్ని యంత్రాలు సహాయంతోనే నిర్మిస్తున్నారన్నారు. యంత్రాలు లేక చాలా మంది నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కార్మికులు ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ నానా కష్టాలు పడుతున్న భవన  నిర్మాణ కార్మికులకు ఎల్ఐసి కి ఇవ్వాలనే నిర్ణయం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం నిర్మాణ కార్మికులకు శాపంగా మారుతుందన్నారు.  కార్మికులకు సంక్షేమ పథకాలు దక్కకుండా పోతాయి అన్నారు. ప్రభుత్వం మరొకసారి ఆలోచించి ఎల్.ఐ.సి కి ఇవ్వాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఇప్పుడు నడుస్తున్న పద్ధతిలోనే క్లైములు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో  లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి, కోశాధికారి ఎస్కే షరీఫ్, కుసుమ సురేష్, వంగరి భూమయ్య, వెంగళ రాములు, జంగిలి.తిరుపతి, బనుక అంజయ్య, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment