సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పవిత్రోత్సవములు ఘనంగా ప్రారంభించబడ్డాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవ కార్యక్రమాలలో మొదటి రోజు అగ్నిప్రతిష్ట, మూల మంత్ర హోమములు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ స్వామివారికి సంవత్సర కాలంలో నిర్వహించే ఆరాధనలు అర్చనలు ఉత్సవాలలో లోపాలు దోషములు తొలగించుటకై పవిత్రోత్సవములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి వై శ్రీనివాసరెడ్డి అర్చకులు సంకర్షణ ఆచార్యులు శ్రీహరిచార్యులు ఫణి కుమార్ ఆచార్యులు ఆండాళ్ గోష్ఠి భక్త బృందం కృష్ణయ్య, సుభాషిని మంజుల లక్ష్మి, సరోజ అరుణ ఆలయ సిబ్బంది శరత్ కుమార్, సైదులు, వెంకన్న భాగ్యమ్మ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవములు
Published On: August 27, 2024 6:47 pm