సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవములు గురువారంతో ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించిన అర్చక బృందం సంకర్షణ ఆచార్యులు శ్రీహరి ఆచార్యులు ఫణికుమార్ ఆచార్యులు రామానుజాచార్యులు స్వామివారికి 108 కలశములతో పాలు పెరుగు తేనె నెయ్యి పండ్లరసాలతో తిరుమంజన స్నపనం అభిషేకం నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ భజనలు కీర్తనలు పాడి తన్మయత్వంతో పులకించారు. తదనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఉభయదారులకు వేద ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వై శ్రీనివాసరెడ్డి ఆండాళ్ గోష్ఠి మహిళా భక్త బృందం మరియు టి ఎస్ వి సత్యనారాయణ, బజ్జూరి కృష్ణయ్య, గజ్జల రవీందర్మం,జుల,లక్ష్మీ, అరుణ, సరోజ,వనజ,పల్లవి తదితరులు పాల్గొన్నారు.