మేడిపల్లి శివారులో ప్రభుత్వ భూముల సర్వే

 

 రామగిరి మండలం రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధి మేడిపల్లి శివారులో మంగళవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. రామగిరి ఖిల్లా ప్రాంతంలో 39.38 ఎకరాల ప్రభుత్వ భూమి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫాస్ట్ట్రక్చర్ కార్పొరేషన్ కు ఇవ్వాలనే ప్రతిపాదనల మేరకు సర్వే నిర్వహించారు. రెవెన్యూ, అటవీ శాఖ, ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ అధికారులు ఈ ప్రాంతంలో భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రామగిరి తహసిల్దార్ బోర్కారి రామచంద్రరావు, ఇండస్ట్రియల్ మేనేజర్,జిల్లా సర్వేయర్ గణపతి,ఆర్.ఐ కే. మహేష్ బాబు,పోనగంటి సంపత్,మండల సర్వేయర్ నాగండ్ల. రాధిక, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పసరగొండ.రంజిత,సెక్రటరీ గంగుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version