వరల్డ్ కరాటే ఛాంపియన్ షిప్ లో ప్రతిభ కనబరిచిన శ్రీ స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల్ పాఠశాల విద్యార్థులు

వరల్డ్ కరాటే ఛాంపియన్ షిప్ లో ప్రతిభ కనబరిచిన శ్రీ స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల్ పాఠశాల విద్యార్థులు

అండర్-13 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన యాస కార్తీక్ రెడ్డి

అండర్-10 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన పిన్నెల్లి రోహిత్

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సూర్యాపేట ప్రతినిధి నవంబర్: 14

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ పాఠశాలలో 7వతరగతి చదువుతున్న యాసకార్తీక్ రెడ్డి, 5వ తరగతి చదువుతున్న పిన్నెల్లి రోహిత్ అనే విద్యార్థులు ఈనెల 10న గోవాలోని కరస్వడ లోని పెడ్డేమ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వరల్డ్ పునాకొషి షాటోకాన్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈనెల7 నుండి 10వ తేదీ వరకు నిర్వహించిన 24వ ఎఫ్ ఎస్ కె వరల్డ్ ఫునకోశి షోటోకన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో అండర్-13 విభాగంలో యాసకార్తీక్ రెడ్డి బంగారు పతకం, అండర్-10 విభాగంలో పిన్నెల్లి రోహిత్ సిల్వర్ పతకం సాధించినారు. గ్రాండ్ మాస్టర్ హన్సి కెవిన్ పునాకోషి, టోర్నమెంట్ ప్రెసిడెంట్ హన్సి హసన్, ఎం ఇస్మాయిల్, టోర్నమెంట్ డైరెక్టర్ హన్సి జోస్ చాగస్, టోర్నమెంట్ కో ఆర్డినేటర్ సెన్సి సునీల్ చౌహన్ చేతుల మీదుగా యాసకార్తీక్ రెడ్డి, పిన్నెల్లి రోహిత్ కు మెడల్స్ అందజేశారు. వరల్డ్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో మెడల్స్ సాధించిన విద్యార్థులను యాసకార్తీక్ రెడ్డి, పిన్నెల్లి రోహిత్ ను పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్. శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్, కరాటే మాస్టర్ క్రాంతి, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment