రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో  మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు,రామగిరి ఎస్సై సందీప్ కుమార్ మరియు ముత్తారం ఎస్సై మధుసూదన్ ఆధ్వర్యంలో మంథని సర్కిల్లోని పోలీస్ సిబ్బందితో కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది.గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి గ్రామంలోని స్థితిగతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా సరైన పత్రాలు లేనటువంటి ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపైన చాలాన్లు వేయడం జరిగింది. గ్రామంలోని యువత గంజాయి మరియు మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వాటి వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించి చెప్పడం జరిగింది. గంజాయి మరియు మత్తు పదార్థాలు ఎవరైనా సేవించిన విక్రయించిన వారి వివరాలను పోలీసు వారికి చేరవేయాలని చెప్పడం జరిగింది. మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పడం జరిగింది.అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది.మీకు తెలియని ఏదైనా  ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి మిమ్మల్ని ఏవైనా ప్రలోభాలకు గురి చేసిన  వెంటనే మీరు 1930 నెంబర్ కు కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని సూచించడం జరిగింది.సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని చెప్పడం జరిగింది. గ్రామంలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని చెప్పడం జరిగింది. మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించడం జరిగింది. మీకు ఎటువంటి సమాచారం తెలిసిన  తక్షణమే 100 నెంబర్ కు కాల్ చేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలని సూచించడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment