ప్రమాదపు అంచున పాకాలేరు బ్రిడ్జి..!..బ్రిడ్జి పై నిలిచిన నీరు.!
-సంబంధిత అధికారుల నిర్లక్ష్యం.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లందు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై నిత్యం అనేక వాహనాలు ప్రయాణిస్తుంటాయి.ఈ మధ్యకాలంలో ఆర్ అండ్ బి శాఖ నుండి రోడ్డు విస్తరణలో భాగంగా నేషనల్ హైవే రోడ్డుగా ప్రకటించినా..మెయింటెనెన్స్ వర్క్స్ మూలన పడేసిన అధికారులు.అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడంతో ప్రయాణికులు వాహనదారులు కన్నెర్ర చేస్తున్నారు. వివరాల్లోనికి వెళితే మహబూబాబాద్ ప్రధాన రహదారిపై కొరవి మండలం బంచరాయి తండ గ్రామ సమీపంలో ఉన్న పాకాలేరు బ్రిడ్జి మొత్తం వర్షపు నీటితో నిండి నీరు ఎటు కదలకుండా బ్రిడ్జి పైనే ఉండటంతో బ్రీడ్జి శిధిలావస్థకు చేరిందని వాహనదారులు వాపోతున్నారు.బ్రిడ్జి మీద నీళ్ళు వెళ్ళే రంద్రాలపై ఇసుక మెటలు వెయ్యడంతో వర్షం ఎటు వెళ్ళే వీలు లేక బ్రిడ్జ్ మీదనే నీరు నిలిచింది.వెంటనే పాకాలేరు బ్రిడ్జిపై ఉన్న ఇసుక మెటలు,చెత్త చేదారంతో పాటు ఆగి ఉన్న నీటిని తొలగించి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా బ్రిడ్జి శిథిలం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.దీనిపై ఆర్ అండ్ బి శాఖ అధికారులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.లేనిఎడల బంచరాయి తండ సమీపంలో పాకాల ఏరు బ్రిడ్జి కూలడం ఖాయం అని పలువురు అధికారుల తీరును విమర్శిస్తున్నారు.