కోరిన కోరికలు తీర్చే శ్రీరాం నగర్ విజయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు

 

 

స్థానిక శ్రీరాంనగర్ కాలనీలోని విజయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు మరింగంటి వరదా చార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అర్చకులు మాట్లాడుతూ ఉదయం స్వామివారికి ఆరాధన పంచామృత అభిషేకం విశేషాలంకరణ నాగవేల్లి దళ సహిత అష్టోత్తర శతనామావళి ఆరగింపు నిర్వహించి తదుపరి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశామన్నారు.అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ విజయాంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తులు కోరుకున్న కోరికలు సత్వరమే తీరేందుకు 11 రోజులపాటు దీక్షగా కంకణ ధరించి 11 ప్రదక్షిణలు చొప్పున ఇక్కడ ఆచరించినట్లయితే వారి కోరికలు సత్వరమే తీరుతాయని ఇక్కడ ప్రసిద్ధి.సకల విజయాలు చేకూరుటకు స్వామివారిని దర్శించి తరించగలరని తెలియజేశారు.ఆలయంలో ప్రతి శనివారం సాయంత్రం భక్తులచే సామూహిక హనుమాన్ ఛాలీసా పారాయణం మరియు భజన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ పూజారి రఘువరన్ ఆచార్యులు ఆలయ కమిటీ అధ్యక్షుడు మండల్ రెడ్డి వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి నాగవేళ్ళి దశరథ కోశాధికారి యలమద్ది అశోక్ కుమార్ సభ్యులు ఆవుల వెంకన్న మనెమ్మ హనుమంతరావు గుండపనేని కిరణ్ కుమార్ లింగారెడ్డి అజిత నాగవేళ్ళి కుమారస్వామి శ్రీనివాస్ నాయుడు వీరస్వామి వెన్న శ్రీనివాస్ రెడ్డి కవిత తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment