ప్రజా సమస్యలు పరిష్కరించండి. 

ప్రజా సమస్యలపై మంగళవారం కమాన్ పూర్ తహసిల్దార్ ఆరిఫోద్దీన్ కు మరియు కమాన్ పూర్ ఎంపిడివో లలిత లకు వేరువేరు గా బిఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కమాన్ పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో విష జ్వరాలపై దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ నిర్వహణ , దోమల నివారణ చర్యలు చేపట్టాలని మరియు వీధి దీపాల ఏర్పాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలు వసతుల గురించి మరియు ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో మరియు వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు బొమ్మగాని అనిల్ ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు గ్రామపంచాయతీ మాజీ కోఆప్షన్ పొన్నం నవీన్ కుమార్ నాయకులు ఎల్లబోయిన రామ్మూర్తి, తోట రాజకుమార్, సాన సురేష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment