ఇక గ్రామాల్లో సింగరేణి సోలార్ లైటింగ్

సింగరేణి ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని పలు గ్రామాలకు  త్వరలో సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. సింగరేణి ఓసీపీ-1 విస్తరణ ప్రాజెక్టులో భాగంగా 25మార్చ్2021 రోజున సెంటినరీ కాలనీ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. దీనిలో భాగంగా అప్పటి ప్రజాప్రతినిధులు సూచన మేరకు ఓసీపీ-1 యజమాన్యం తరఫున రెమిడేషన్ ప్లాన్ కింద సోలార్ లైట్లు కేటాయించారు. రత్నాపూర్ కు 15, పన్నూరుకు 15, నాగపల్లికి 15,జూలపల్లికి 10, ముల్కల పల్లికి 10 చొప్పున, ఇతర ప్రాంతాలలో 16 లైట్లు ఏర్పాటు చేయనున్నారు. 30 వాట్ ల కెపాసిటీ కలిగిన సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తారు. 81 లైట్లకు రూ. 24.30 లక్షల నిధులు తో వీటిని ఏర్పాటు చేయనున్నారు. 2 సంవత్సరాల వారంటీతో, పది సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ లైట్లు పనిచేస్తాయి. ఆర్జీ-3 జీఎం నరేంద్ర సుధాకర్ రావు, ఓసీపీ-1 ప్రాజెక్టు ఆఫీసర్,రేమీడేషన్ ప్లాన్ చైర్మన్ నలజాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ కోలాగుర్ కిషన్ ఈ పనులు పరివేక్షిస్తున్నారు. సోలార్ లైట్ లు మంజూర్ పట్ల తాజా మాజీ సర్పంచ్ లు పల్లె ప్రతిమ పీవీరావు, అల్లం పద్మా తిరుపతి, కొండవేని ఓదెలు, బొల్లపల్లి శంకర్ హర్షం వెలిబుచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment