బయ్యారం మండల విద్యుత్ సిబ్బందిని అభినందించిన సియండి.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
తుఫాన్ ప్రభావం తో ఏడ తెరపు లేకుండా కురుస్తున్న వర్షం కారణం గా,పాకాల ఏరు ఉదృతంగా ప్రవహిస్తూ, బయ్యారం మండలం జగ్గు తండా గ్రామ పంచాయతీ పరిధి లో ఉన్న బంజారాతండా ను ముంచివేసింది.ఈ ప్రాంతం లో 33 కే. వి లైన్ తెగి విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సిబ్బంది సకాలంలో స్పందించి లైన్ ఇన్స్పెక్టర్ సలీం, తన తోటి సిబ్బంది,అనిల్, సురేష్, హనుమాన్ సాగర్, అశోక్, శంకర్ లతో, మరమ్మత్తు చేయించి పలు జాగ్రత్తలు తీసుకొని లైన్ క్లియర్ చేసి విద్యుత్ అందించడం జరిగినది. ఈ విషయం తెలుసుకున్న టీజీ ఎంపీడీసీఎల్ సీ.ఎం.డి వరుణ్ రెడ్డి, ఏ.ఈ సుమన్, గ్రామ ప్రజలు వారిని అభినందించడం జరిగినది.